Your prayer request will be sent to our prayer partners so that they may intercede on your behalf.Request for Prayer

About Us

కీ. శే. పాస్టర్ దేవదత్తం గారు, తల్లి లూసీ హెలెన్ గార్లు EPFM INDIA వ్యవస్థాపకులు. తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట కాకినాడ నుండి ఉద్యోగరీత్యా విజయవాడ వచ్చి ఉద్యోగం చేస్తూ ఆత్మల పట్ల భారం కలిగి  పటమట దానయ్య గారి బజారులో 1967 లో దేవుని వాక్య పరిచర్య చేస్తూ ఇంటి వరండాలో 5గురు విశ్వాసులతో సంఘ ఆరాధనా ప్రారంభించినారు. 1970లో మరియొక గృహాన్ని దేవుని మందిరం కొరకు ప్రతిష్టించగా 12మంది అన్యులు బాప్తిస్మము ద్వారా సంఘములోనికి చేర్చబడిరి.

జీవముగల దేవుని ఎరుగని క్రైస్తవేతరులు అనేకమంది యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరిస్తూ సంఘం అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో దేవదత్తం గారు 1979లో పారిస్ చాక్లెట్ ఫ్యాక్టరీ లో క్యాషియర్ గా పనిచేస్తూ, పరిచర్య చేస్తూ వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని 11సం. లు  సంపూర్ణ పరిచర్య చేసారు. 1988లో మందిర నిర్మాణం విస్తరించబడినది. 1990 సెప్టెంబర్ 11వ తేదీన (” అతడు సేవచేయు దినములు సంపూర్ణమైనపుడు తన ఇంటికి వెళ్లెను” లూకా 1:23 ) మహిమ ప్రవేశం గావించినారు.

1990 డిసెంబర్ 14వ తేదీ దేవదత్తం గారి చిన్న కుమారుడు సంఘ పరిచర్య కొనసాగిస్తున్న గుర్రపు అబ్రహం సుధాకర్ కు నూతక్కి దేవిక తో వివాహము జరిగినది. వీరు M.A, BD చదివి ఉద్యోగం చేస్తూ తండ్రి గారికి సహకరిస్తూ ఉండగా, తండ్రిగారి తదుపరి సంపూర్ణమైన సంఘ బాధ్యతలు, సంఘ సభ్యుల ఆమోదంతో స్వీకరించారు. వీరి సతీమణి దేవిక M.Sc,Ph.D చదివి 1991 నుండి 2009 వరకు 18 సం. లు  గీతాంజలి, నారాయణ, గాంధీజీ మహిళా కళాశాలలో లెక్చరరుగా మరియు ప్రిన్సిపుల్ గా పనిచేసి 2009లో సంపూర్ణ పరిచర్య కి సమర్పించుకొని, సేవా భాధ్యతలు నిర్వహిస్తున్నారు.

1991 సెప్టెంబర్ 11వ తేదీన వీరికి కుమారుని (శామ్యూల్ జీవన్ దత్)  బహుమానంగా దేవుడు అనుగ్రహించియున్నాడు. వీరి కుమారుడు శామ్యూల్ దత్B.Tech, చేసి, ఆస్ట్రేలియా లో M.S చదువుచున్నాడు. భవిష్యత్తులో దేవుని పరిచర్య సంపూర్ణముగా చేయవలెనని ప్రార్ధిస్తూ, నిరీక్షిస్తున్నాము.

దేవుని మహా కృపను బట్టి సంఘ సరిహద్దులు విశాలపర్చబడి 2002లో మొదటి అంతస్తులో మందిర నిర్మాణం జరిగి పునఃప్రతిష్ఠ చేయబడినది. 2010లో రెండు అంతస్తులో సంఘ సరిహద్దులు మరింత విస్తరించబడి మందిర నిర్మాణం జరిగి పునఃప్రతిష్ఠ చేయబడింది. సండే స్కూల్ టీచర్లు, యూత్ లీడర్లు, స్త్రీల సమాజ పరిచారకులు, నశించిపోయే ఆత్మల పట్ల భారము కలిగి ఉద్యోగమూ, వ్యాపారము చేసుకుంటూ స్వచ్చందముగా సేవ లో సహకరిస్తూ మరియు పిలుపు మేరకు సంపూర్ణ పరిచర్య లో పాలిభాగస్థుల సహకారం తో విజయవాడ నగరం లో పటమట, ఆటోనగర్, సనత్నగర్, కానూరు, పెనమలూరు, తాడిగడప, అయ్యప్పనగర్, యనమలకుదురు, అంబేద్కర్నగర్, మంగళగిరి, సింగన్నగూడెంలో సంఘ పరిచర్య అభివృద్ధి చెందుతూ కొనసాగింపబడుచునది. EPFM-INDIA అనుభంధముగా మోపిదేవి, మండవల్లి, పెరికేగూడెం (తెనాలి), కారుమూరు, పెరవలి (గుంటూరు జిల్లా) దేవరపల్లి (విశాఖ జిల్లా ) సికింద్రాబాద్ (తెలంగాణ) పరిచర్యలు విస్తరింపబడుచునది.

2012 నుండి మిషనరీ పరిచర్య లో జార్ఖండ్ (FMPB) “మల్పాహాడియా” , “సంతాలీ జాతి” ప్రజా గుంపు మధ్య పరిచర్య మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్ బోర్డర్లో వున్నా చికలధార (IEM) “కొరుకు జాతి” ప్రజా గుంపుల మధ్య పరిచర్య, తెలంగాణ లో ఆదిలాబాద్ జిల్లా IEHC “గోండు” “బంజారా” ప్రజల మధ్య పరిచర్య, ఆత్మల పట్ల భారము కలిగి సంఘము మిషనరీలను దత్తతు తీసుకుని పలిభాగము కలిగి పరిచర్య జరిగించుచున్నది.

 

Upcoming Events

Our Gallery

Testimonials

  • వీరయ్య
    "నా పేరు వీరయ్య. విజయవాడలో పోరంకి గ్రామంలో వుంటాము. వేంకటేశ్వరస్వామి న ఇష్ట దైవం. ప్రతి శనివారం ఎంతో నిష్టగా పూజలు చేసేవాడిని. నేను R.T.C లో జాబ్  చేసేవాడిని. 20 సం. ల క్రితం కామెర్లు వచ్చినాయి. 40 రోజులు ఆహరం లేకుండా గ్లూకోస్ వాటర్ తో ఉండేవాడిని. చాల నిస్సత్తువగా అయ్యాను. అప్పుడు యేసుప్రభువు తెల్లని వస్త్రములు ధరించి ఒక రాత్రి నాతో మాట్లాడినారు. బాబు నేను వున్నాను భయపడకు లే అని అయన చేతిలో నుండి ఒక వెలుగువలె వచ్చి తాకింది. వెంటనే న నీరసం నాలోనుండి పోయి నాకు ఎంతో శక్తి వచ్చింది. మరునాడు నా జాబ్ కి వెళ్ళాను. అయినాసరే యేసుప్రభువుకి లోబడలేదు. మా పెద్ద అమ్మాయి ప్రార్ధన చేసేది, వచ్చినపుడు దేవుని మాటలు చెప్పేది అయినా లోబడక పూజలు చేసేవాడిని. ReadMore---"
  • గండ్రాల సరోజినీ
    "నా పేరు గండ్రాల సరోజినీ. మా కుటుంబం లో అందరికన్నా పెద్దదానిని అయిన నన్ను 1960 సం. లో మా మేనత్త కుమారుడైన ప్రసాదరావు కి ఇచ్చి వివాహం చేసారు. నాకు చిన్నప్పటి నుంచి అనగా పెళ్లి అవ్వక ముందు నుంచి కూడా యేసు ప్రభువు అంటే చాలా ఇష్టం. ఎపుడు కూడా చర్చి కి వెళ్లేదాన్ని. ప్రార్ధన చేసుకునే దాన్ని. ReadMore.......
  • దైవకృప.
    నా పేరు దైవకృప. మా ఊరు విజయవాడలో పోరంకి. నేను విగ్రహారాధన కుటుంబంలో పుట్టాను. మా తండ్రి వేంకటేశ్వరస్వామి భక్తుడు. మేము 5గురు పిల్లలు. ప్రతి శ్రీరామనవమికి పాటలు పాడుతూ భజన చేసేవారము. పోరంకిలో మా పిన్ని 35 సం. ల క్రితం యేసు ప్రభువును అంగీకరించి ఆయన మార్గం లో నడుస్తూ ఉండేవారు. వారి ఇంటికి అపుడపుడు పాస్టరుగారు కొంతమంది విశ్వాసులు వచ్చి కూడిక పెట్టేవారు. నేను ఆ కుడికకు వెళ్లి వారితో కలిసి పాటలు పాడి ప్రార్ధనలో ఉండి వచేదాన్ని. " నాకు 17 సం. ల వయసులో వివాహం చేయాలనీ పెళ్లి సంబంధాలు చూస్తూ పటమటలో అంగిరేకుల వెంకటేశ్వరరావు గారి ఇంటికి వెళ్లారు. ఆయనకు 40 సం. ల క్రితం రాచపుండు వచ్చింది. వారు కూడా బాగా విగ్రహారాధికులు. ఎన్నో మ్రొక్కులు మ్రొక్కి, ఎన్నో హాస్పిటల్స్ కి చూపిస్తూ మావల్ల కాదు అని డాక్టర్లు చెప్తే గుణదల ...... ReadMore---